MLG: ఏటూరునాగారం మండలంలోని దొడ్ల కొత్తూరు గ్రామంలో గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో IAP నిధులతో నిర్మించిన డీఆర్ సేల్స్ డిపో శిథిలావస్థకు చేరింది. రేషన్ సరఫరా కోసం నిర్మించిన ఈ భవనం కాలక్రమేణ దెబ్బతిని, ప్రధాన ద్వారం షట్టర్ విరిగిపోయింది. దొంగలు, పశువులు లోపలికి రాకుండా నిర్వాహకులు కర్రలు ఏర్పాటు చేశారు. తక్షణం మరమ్మతులు చేయాలని స్థానికులు కోరారు.