భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో లంచ్ బ్రేక్ సమయానికి వెస్టిండీస్ 8 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. 301 పరుగులు వెనకబడి ఉంది. ఫాలోఆన్ నుంచి బయట పడేందుకు ఇంకా 102 పరుగులు చేయాల్సి ఉంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, జడేజా 3 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌ను భారత్ 5 వికెట్లు కోల్పోయి 518 పరుగులు చేసిన విషయం తెలిసిందే.