TPT: సింగాలకుంటలోని మసీదు వీధిలోని మురికి కాలువలో నెలలు నిండని శిశువు మృతదేహం స్థానికులకు కంటపడింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక విఆర్వో అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఆజిత తెలిపారు. త్వరలోనే విచారించి వివరాలు వెల్లడిస్తామన్నారు.