మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న పట్టణ, పల్లె ప్రకృతి వనాలలో పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. కొన్నిచోట్ల అటవిని తలపిస్తున్నాయి. మున్సిపాలిటీలలో కనీసం పట్టించుకునే నాధుడే లేడని పలువురు ఆరోపిస్తున్నారు. వాకింగ్ ట్రాక్స్ మొత్తం మూత పడిపోయాయి. దీనిపై యంత్రాంగం తగిన విధంగా స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.