VKB: యాలాల్ మండల కేంద్రంలో పథ సంచలన నిర్వహించారు. స్వయం సేవకులు దండ సహిత గణ వేషధారణలో చేపట్టిన ర్యాలీ ఆకట్టుకుంది. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా నిర్వహించారు. గ్రామస్థులు పూలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాలేశ్వరుప్తా, జడ్పీటీసీ మాజీ సభ్యుడు సిద్రాల శ్రీనివాస్, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.