VZM: శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అనంతరం వచ్చే మంగళవారం14వ తేదిన పెద్దచెరువులో తెప్పోత్సవం జరగనున్నట్లు అధికారులు తెలిపారు. రైల్వే స్టేషను గాఢీఖానా సమీపంలో ఇప్పటికే చదును పనులు చేపట్టారు. మధ్యాహ్నం 3 గంటలకు వనం గుడిలో వేదసభ, అమ్మవారికి పంచామృతాభిషేకాల అనంతరం ఊరేగింపుగా ఉత్సవ విగ్రహాన్ని తరలిస్తారు. 5 గంటలకు తెప్పోత్సవం జరుగుతుందని ఈఓ శిరీష పేర్కొన్నారు.