GNTR: శిథిలావస్థకు చేరిన తెనాలి మున్సిపల్ కార్యాలయ భవనాన్ని తాత్కాలికంగా మార్కెట్ కాంప్లెక్స్లోనికి తరలిస్తున్నారు. ఇప్పటికే కొన్ని రికార్డులను షిఫ్ట్ చేయగా, ఈ నెలాఖరు నాటికి పెండింగ్ పనులను పూర్తి చేసి, అన్ని విభాగాలను తరలిస్తామని అధికారులు తెలిపారు. కొత్త భవన నిర్మాణం పూర్తయ్యే వరకు మార్కెట్ కాంప్లెక్స్ నుంచే సేవలు అందిస్తున్నారు.