తెలుగులో ప్రత్యేకమైన క్రేజ్ ఉన్న తమిళ హీరోల్లో శింబు ఒకరు. ఇప్పుడు ఆయన నేరుగా తెలుగు సినిమా చేయడానికి సిద్ధమయ్యారట. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ సినిమాలో హీరోగా నటించనున్నట్లు సమాచారం. దర్శకుడు దీపక్ రెడ్డి తెరకెక్కించనున్న ఈ సినిమాకు శింబు ఓకే చెప్పారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.