ప్రకాశం: ఒంగోలులోని గాంధీ పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పరిశీలించాడు. గాంధీ పార్కులో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, అలాగే నగరంలో రోడ్ల విస్తరణ పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, స్థానిక కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.