TG: వేములవాడ రాజన్న ఆలయం మూసివేతపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ‘రాజన్న మొక్కులు భీమన్నకు ఎలా చెల్లిస్తారు?’ అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భక్తుల మనోభావాలకు భంగం కలిగిస్తే ఊరుకోమని, హడావుడిగా తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకిస్తామని హెచ్చరించారు. ఎన్ని రోజులు ఆలయం మూసివేస్తారనే దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.