KMR: ఆర్య వైశ్యులు రాజకీయంగా ఎదగాలని బిక్కనూర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పురం రాజమౌళి అన్నారు. ఆదివారం ఆయనను పలువురు ఆర్యవైశ్యులు అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యులు పోటీ చేయాలని సూచించారు. రాజకీయంగా ముందుకు పోయే ఆర్యవైశ్యులకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.