KRNL: చిప్పగిరి మం. బంటనహల్ గ్రామంలో స్మశాన వాటిక ఏర్పాటు కోసం గ్రామ యువత నడుం బిగించారు. ప్రతీ ఇంటికీ తిరుగుతూ సంతకాల సేకరణ చేశారు. వాగు పక్కన శ్మశాన వాటిక కోసం స్థలం కేటాయించాలని, అలాగే శాశ్వత రహదారి ఏర్పాటుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరారు. రమేశ్ బాబు, వేంకటపతి, అశోక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఉన్నారు.