NLR: ఒక దొంగకు దేహశుద్ధి చేసిన సంఘటన శనివారం మనుబోలు మండలంలోని కొండూరు సత్రంలో జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి రెండు రోజుల క్రితం మనుబోలులో ఒక దుకాణంలో దొంగతనం చేసి, ఆ వస్తువులను అమ్మేందుకు కొండూరు సత్రానికి వచ్చారు. అనుమానాస్పదంగా కనిపించడంతో ఆ వ్యక్తిని స్థానికులు పట్టుకుని నిలదీశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.