NZB: మోపాల్ మండలంలోని సిర్పూర్ గ్రామానికి చెందిన గోదా సందీప్ (29) అనే యువకుడు కుటుంబ కలహాలతో ఇంట్లో డిష్ వైర్‌తో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సుస్మిత శనివారం సాయంత్రం తెలిపారు. రెండు రోజుల క్రితం భార్యతో జరిగిన చిన్నపాటి గొడవతో మనస్తాపం చెంది ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.