JGL: ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఆదివారం పూజలు నిర్భహించారు. ఈ సందర్బంగా ఆయనకు పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఆలయ ఛైర్మన్, ఈవో ఆయనకు స్వామి శేష వస్త్రం, చిత్రపటంతో సత్కరించారు.