‘గాజా శాంతి ఒప్పందం’ సమావేశానికి హాజరు కావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి ప్రధాని మోదీకి ప్రత్యేక ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఈ కీలక సమావేశం రేపు జరగనుంది. అయితే ఈ సమావేశానికి మోదీ హాజరుపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అంతర్జాతీయంగా ప్రాధాన్యత ఉన్న ఈ శాంతి చర్చల్లో మోదీ పాల్గొంటారా లేదా అనేది చర్చనీయాంశమైంది.