KMR: బిక్కనూర్లో చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని Dr.హెమిమా కోరారు. ఆమె మాట్లాడుతూ.. పోలియో చుక్కలు వేస్తున్నట్లు కొందరు సామాజిక మాధ్యమాలలో అసత్యపు ప్రచారం చేస్తున్నారని, ప్రజలు అలాంటి వాటిని పట్టించుకోవద్దని సూచించారు. పోలియో చుక్కల కార్యక్రమం ఉంటే ఆరోగ్య శాఖ ముందుగానే సమాచారం ఇస్తుందని తెలిపారు.