JGL: పట్టణంలోని పావని కంటి ఆసుపత్రిలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ఆదివారం 18 మంది నిరుపేదలకు ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేయించారు. అనంతరం వారికి ఉచితంగా కంటి అద్దాలు, మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డా.విజయ్, మాజీ వైస్ ఎంపీపీ సొల్లు సురేందర్, సీనియర్ పాత్రికేయుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.