VKB: మహాత్మా బసవేశ్వరుడి మార్గం ఆచరణీయమని వికారాబాద్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ బసవరాజ్ పటేల్ పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నేపల్లిలోని బసవేశ్వర విగ్రహానికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం వికారాబాద్ అధ్యక్షుడు అప్ప విజయకుమార్, వీరేశం భద్రప్ప, ఆత్మలింగం, వీరన్న తదితరులు పాల్గొన్నారు.