కోనసీమ: తిరుమల వాడపల్లి వెంకన్న 13వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం మచిలీపట్నం జిల్లా జడ్జి పాండు రంగారెడ్డి కుటుంబ సమేతంగా వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం అందజేయగా ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలను అందజేశారు.