ELR: పెదపాడు మండలం వడ్డిగూడెం గ్రామంలో ఆదివారం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.