గ్రేటర్ HYD పరిధిలో సైబర్ సెక్యూరిటీ కోర్సులో శిక్షణ అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ విమలరెడ్డి తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారు శిక్షణకు అర్హులని, ఈ నెల 16 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.