కృష్ణా: బంటుమిల్లి గాంధీ బొమ్మ సెంటర్లో గుడివాడకు వెళ్లే మెయిన్ రోడ్డు గుంతలమయం కావడంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షానికే గుంతలు నిండి ఉండడంతో కొత్తవారు ప్రమాదాలకు గురవుతున్నారు. రోజు ఇదే ప్రదేశంలో ట్రాఫిక్ జామ్ అవుతుందని, దానికి తోడు ఈ గుంతలు కూడా పడడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.