WGL: పట్టణ కేంద్రంలోని 44వ డివిజన్ కడిపికొండ ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం కోసం జాగ్రత్తలు పాటించాలని, ఆరోగ్యమే మహాభాగ్యమని డాక్టర్లు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.