NLG: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేసే కూలీల బోగస్ హాజరుకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా కూలీలకు EKYC నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జాతీయ మాస్టర్ పర్యవేక్షణ వ్యవస్థ యాప్లో కూలీల వివరాలు, EKYCనమోదు చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో 765128 జాబ్ కార్డులు ఉండగా,1598634 మంది కూలీలు ఉన్నారు.