WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని పర్వతాల శివాలయాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ జీవే రాముడు దర్శించుకున్నారు. పూజారి హర్షవర్ధన్ ఆచార్యుల ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన కల్లెడకు చెందిన ఎర్రబెల్లి రామ్మోహన్ రావు.. రాములుకు ఆలయ విశిష్ఠతను తెలియజేశారు. ఆలయంతో పాటు పరిసరాలను పరిశీలించారు.