పశ్చిమ బెంగాల్లో ఒడిశాకు చెందిన ఓ MBBS విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. స్నేహితుడితో కలిసి వెళ్లిన యువతిని పలువురు కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడ్డారు. రక్తస్రావంతో స్పృహ కోల్పోయిన బాధితురాలు ICUలో చికిత్స పొందుతోంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ నేరంలో యువతి స్నేహితుడి ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులో తేలింది.