SRD: పటాన్ చెరు GHMC కార్యాలయ ఆవరణలో పల్స్ పోలియో ప్రోగ్రాంలో పటాన్ చెరు MLA గూడెం మహిపాల్ రెడ్డి చురుకుగా పాల్గొన్నారు. పల్స్ పోలియో ప్రోగ్రాంలో చిన్నారులకు చుక్కల మందు వేయించి, పోలియో రహిత సమాజాన్ని ఏర్పాటు చేసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొల్కూరి నరసింహారెడ్డి పాల్గొన్నారు.