TG: పెద్దపల్లి(D) అంతర్గాంలో ప్రాంతీయ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించిన సాధ్యాసాధ్యాల నివేదిక(TESR) తయారీకి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కన్సల్టెన్సీ ఫీజుల కింద AAIకి రూ.40.53L విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో బసంత్‌నగర్‌లో ప్రతిపాదించినా.. నివేదిక అనుకూలంగా రాకపోవడంతో, ప్రత్యామ్నాయంగా అంతర్గాంలో 591.24 ఎకరాల భూమిని గుర్తించారు.