AP: విశాఖలో పర్యటన దృష్ట్యా రోడ్డు పక్కన చెట్లు నరికేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఎక్కడా చెట్లు కొట్టేయడం లేదని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. వైసీపీ అధికారిక ట్విట్టర్, సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రోడ్ల సుందరీకరణ పనులను కూడా వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని, రాజకీయ దురుద్దేశంతో తప్పుడు ప్రచారం చట్టరీత్యా నేరమన్నారు.