తమ దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనంగా 100% సుంకాలు విధించడంపై చైనా తీవ్రంగా స్పందించింది. US ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందంటూ మండిపడింది. ఈ చర్యలు తమ ప్రయోజనాలకు తీవ్ర హాని కలిగిస్తాయని.. ఇరుదేశాల మధ్య జరగాల్సిన ఆర్థిక, వాణిజ్య చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తాయంది. కాగా, అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.