KDP: ప్రొద్దుటూరు వీధుల్లో ఆవులు తిండి కోసం చెత్త కుప్పల్లో తిరుగుతూ ప్రమాదాలకు గురవుతున్నాయి. వీటి వల్ల ట్రాఫిక్ సమస్యలు, చిన్నపాటి ప్రమాదాలు పెరుగుతున్నాయి. యజమానులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఆవులను గోశాలలకు తరలించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. ఆవులకు యజమానులు ఉన్నా ఆవులను పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు.