AP: పల్నాడు(D) వెల్దుర్తి(M) వజ్రాలపాడు పరిధిలోని దావుపల్లితండాలో ఓ వ్యక్తికి మెలియాయిడోసిస్ లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. అతనికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ కావడంతో డాక్టర్లు మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించారు. గ్రామంలో సిబ్బంది పారిశుధ్య పనులు చేపట్టారు. జిల్లా వైద్యాధికారి రవి గ్రామంలో పర్యటించి గ్రామస్తులు భయపడాల్సిన అవసరం లేదని సూచించారు.