NLG: ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అన్నదాతలు అరిగోస పడుతున్నారు. నకిరేకల్ మండలంలో చీమలగడ్డ (దొడ్డు), చీమలగడ (సన్న), చందుపట్ల, తాటికల్లు, నెల్లిబండ పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో కొందరు నిర్వాహకులు రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల సమస్యలను విలేకరులు, అధికారులకు చెప్తే ధాన్యం కొనుగోలు చేయమని బెదిరిస్తున్నారు.