ADB: డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులపై ఫీజుల భారాన్ని తగ్గించాలని తెలంగాణ విద్యార్థి పరిషత్(TGVP) నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పట్టణంలో శనివారం నిర్వహించిన సమావేశంలో TGVP ఉమ్మడి జిల్లాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. ఫీజులు తగ్గించకపోతే ఆందోళన చేపడుతామని ప్రభుత్వానికి తెలియజేశారు. నాయకులు వెంకట్, సతీష్, నరేందర్ యాదవ్ తదితరులున్నారు.