KRNL: నగరంలో బాలికపై లైంగికదాడికి యత్నించిన ఖాజాబాషా అనే వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. చాక్లెట్ ఆశ చూపి బాలికను బైక్పై తీసుకెళ్లి దాడికి పాల్పడబోగా, బాలిక కేకలు వేయడంతో స్థానికులు స్పందించి అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. 2020లోనూ ఇలాంటి కేసులో ఖాజాబాషా ముద్దాయిగా ఉన్నట్లు తెలిపారు.