GDWL: జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పూర్తిగా తగ్గింది. ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుంచి 40,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోందని ప్రాజెక్టు అధికారి జుబేర్ హమ్మద్ తెలిపారు. వరద తగ్గుముఖం పట్టడంతో జూరాల గేట్లను మూసివేశారు. ప్రస్తుతం ఔట్‌ఫ్లో 61,451 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టులో 9.657 టీఎంసీల నీరు నిల్వ ఉందని, అధికారులు తెలిపారు.