MNCL: బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఈనెల 17న బెజ్జార్ మండలంలోని కుష్ణపల్లి నుంచి దిందా గ్రామం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నాయకుడు అర్షద్ హుస్సేన్ ఒక ప్రకటనలో తెలిపారు. పాదయాత్రకు మండలంలోని బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.