AP: విజయవాడలో రేపు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. ఈ సమ్మెలో రెగ్యులర్ ఉద్యోగులు 34,600, కాంట్రాక్టు కార్మికులు 29 వేల మంది కలిపి మొత్తం 63,600 మంది ప్రత్యక్షంగా ఆందోళనల్లో పాల్గొనున్నట్లు సమాచారం.