CTR: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కార్వేటినగరం మండలం పరిధిలోని కృష్ణాపురం జలాశయంలో ఇన్ ఫ్లో పెరిగినట్లు అధికారులు తెలిపారు. జలాశయం గేట్ల ద్వారా ఇవాళ సాయంత్రం 4:00 గంటలకు నీటిని విడుదల చేయనున్నట్లు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, కృష తెలియాజేశారు. కావున ప్రజలు అందరూ అప్రమత్తత వహించి, కుశస్తలి నది పరివాహక ప్రాంతంలోనికి వెళ్ళరాదు అని కోరారు.