తమిళ స్టార్ హీరో సూర్య, RJ బాలాజీ కాంబోలో ‘కరుప్పు’ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్‌పై దర్శకుడు బాలాజీ క్లారిటీ ఇచ్చారు. మొదట దీపావళి కానుకగా దీన్ని విడుదల చేయాలనుకున్నామని, సీజీ వర్క్ కారణంగా ఆలస్యంగా రానుందని తెలిపారు. అయితే దీపావళికి ఫస్ట్ సాంగ్ వస్తుందని, డ్యాన్స్‌తో సెగలు పుట్టించడం ఖాయమని చెప్పారు.