కృష్ణా: గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్లో రోల్ కాల్ ఫటీగ్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. సిబ్బందితో శ్రద్ధగా విధి నిర్వహణ, వ్యక్తిగత శుభ్రత, డ్యూటీ సమయపాలన ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం వంటి అంశాలపై ఎస్సై చంటిబాబు పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు. సిబ్బంది సమస్యలు, అవసరాలను వినిపించుకుని, క్రమశిక్షణలో విధులు నిర్వహించాలని పేర్కొన్నారు.