E.G: పాపికొండల విహారయాత్ర మూడు నెలల తర్వాత పునఃప్రారంభమైంది. గండిపోశమ్మ అమ్మవారి ఆలయం నుంచి శనివారం కావేరి బోటులో 23 మంది పర్యాటకులు పాపికొండలు అందాలు చూడ్డానికి వెళ్లారు. జలవనరుల శాఖ, పర్యాటక శాఖ సిబ్బంది, పోలీసులు తనిఖీలు నిర్వహించి బోటులోకి అనుమతించారు. దీపావళి నేపథ్యంలో రద్దీ పెరిగే అవకాశం ఉందని బోటు నిర్వాహకులు చెబుతున్నారు.