TPT: సత్యవేడుతోపాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని MLA కోనేటి ఆది స్పష్టం చేశారు. శనివారం సత్యవేడులో నిర్మాణంలో ఉన్న అన్న క్యాంటీన్ TTD కళ్యాణ మండపం పనులను MLA కోనేటి ఆదిమూలం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పలు వంతెనల పూర్తికి కృషి చేస్తానన్నారు.