CTR: సోమల(M) పెద్ద ఉప్పరపల్లిలో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి గార్గేయ నది, సీతమ్మ చెరువు వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నీటి ప్రవాహానికి పెద్ద ఉప్పరపల్లి – బసవపల్లి మార్గంలోని తాత్కాలిక దారి పైపులతో సహా కొట్టుకుపోయింది. అవతలి వైపు ఉన్న రెడ్డివారిపల్లి, చిన్నకంపల్లి, బోనమంద, బసవపల్లి, పేటూరు, పోలికి మాకులపల్లికి రాకపోకలు నిలిచాయి.