NLR: కొడవలూరు మండలం రాజుపాలెం గ్రామంలో శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో 4 ఇళ్ళు కాలి బుగ్గయి పోయాయి. విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. అధికారులను సహాయక చర్యలకు ఆదేశించారు. దగ్ధమైన ఒక్కో ఇంటికి 25వేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు.