RR: బీఎన్ రెడ్డినగర్ సమీపంలోని గుర్రంగూడ వద్ద శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో థార్ కారు డ్రైవర్ అతివేగంగా వచ్చి ముందుగా బైక్ను ఢీ కొట్టాడు. అనంతరం డివైడర్ దాటి మరో కారును ఢీ కొట్టి తర్వాత.. మూడు పల్టీలు కొట్టి థార్ పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.