NDL: బండి ఆత్మకూరు మండలం ఓంకార క్షేత్ర పరిధిలో బీజేపీ శ్రీశైలం నియోజకవర్గం విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. జాతీయ కార్యవర్గ సభ్యురాలు మోమిన్ షబానా పాల్గొన్నారు. ఈనెల 16న ప్రధాని నరేంద్రమోదీ నంద్యాల, కర్నూలు జిల్లాల పర్యటన నేపథ్యంలో పలుసూచనలు చేశారు. నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.