NZB: నగరానికి చెందిన అల్తాపుద్దీన్ ఫారూఖ్ అలియాస్ జుబేర్పై ఫిబ్రవరి 4న రాత్రి 10 గంటలకు హత్యాయత్నం జరిగింది. ఆటోలో వచ్చిన అమీర్, అయేషాలు కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించారు. తప్పించుకున్న జుబేర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న నిందితులు అమీర్, అయేషాలను శనివారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై ముజా తెలిపారు.