»Russian Man Loose 23 Kg Weight After Running 21 Km Running
Dieting Weight Loss: ఒక్కరోజులో 11 కిలోల బరువు తగ్గి.. 69 ఏళ్ల వయసులో అద్వితీయ రికార్డు
ప్రస్తుతం రష్యా రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్ నుండి అలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నివసించే బహమా ఐగుబోవ్(69), ఆయన 2019 సంవత్సరంలో ఒక రేసులో పాల్గొన్నాడు. అక్కడ అతను సుమారు ఐదు గంటల పాటు పరిగెత్తాడు.
Dieting Weight Loss: ఫిట్‌గా ఉండటానికి ప్రతి ఒక్కరూ మొదట చేయాల్సిన పని బరువును తగ్గించుకోవడం. నేటి కాలంలో ప్రతి ఒక్కరూ తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడంలో చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే ఎక్కువ గంటలు కుర్చీపై కూర్చొని పనిచేయడం.. మారిన జీవన శైలి మన ఆరోగ్యం పై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి. కొంత మంది జిమ్‌కి వెళ్లి బరువు తగ్గడం కోసం గంటల తరబడి చెమటలు కక్కుతుండగా, పార్కుల్లో ఎక్కువ మంది వ్యాయామం చేస్తుంటారు. రన్నింగ్ ఒక అద్భుతమైన వ్యాయామం, ఇది మన శరీరాన్ని వ్యాధుల నుండి రక్షిస్తుంది. అయితే ఒక వ్యక్తి 21 కి.మీ పరిగెత్తడం ద్వారా 11 కిలోల బరువు తగ్గించుకున్నాడు.
ఇది మీకు వింతగా అనిపించవచ్చు కానీ ఇది పూర్తిగా నిజం. ప్రస్తుతం రష్యా రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్ నుండి అలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నివసించే బహమా ఐగుబోవ్(69), ఆయన 2019 సంవత్సరంలో ఒక రేసులో పాల్గొన్నాడు. అక్కడ అతను సుమారు ఐదు గంటల పాటు పరిగెత్తాడు. అతను తన బరువు తొమ్మిది కిలోలు కోల్పోయినట్లు పేర్కొన్నాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో మరోసారి తన వాదనపై ప్రజల్లో చర్చకు వచ్చింది. ఈసారి తాను 21 కిలోమీటర్ల రేసులో పరుగెత్తానని, కేవలం రెండున్నర గంటల్లోనే 11 కిలోల బరువు తగ్గానని చెప్పాడు. అయితే, ఈ వ్యక్తి ఇంతటి ఘనత సాధించినప్పటికీ ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు కాలేదు ఎందుకంటే వారు ప్రాణాలకు ముప్పు కలిగించే లేదా శరీరానికి హాని కలిగించే.. విజయాన్ని నమోదు చేయకూడదని వారు చెప్పారు. బహామాస్ జూడో, సాంబో, గ్రీకో-రోమన్ ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో మాస్టర్. వీలైనంత త్వరగా బరువు తగ్గడం ఎలాగో బహామాస్కు బాగా తెలుసు.
Russie : Bahama Aigubov, 69 ans, habitant du Daghestan, "a perdu 11 kg en 2,5 heures en courant lors de la course Atletica sur une distance de 21 km."
Le détenteur du record a admis qu'il avait appris à perdre du poids rapidement dans sa jeunesse, lorsqu'il pratiquait la lutte. pic.twitter.com/qcUxuvoyLq